న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. కడప నగరంలోని వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా జూన్ 17 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చైర్మన్ శ్రీ రెడ్డెప్పగారి శ్రావణ్ రాజ్ రెడ్డి పాల్గొని, మ్యాచ్‌లను అధికారికంగా ప్రారంభించారు.
స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి, కడపలో క్రీడా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి భారీ టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు, నగర యువత పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ మ్యాచ్‌లను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.