google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు...

అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు...

న్యూస్ 21 తెలుగు: అంతరాష్ట్ర స్థాయిలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 11 తులాల బంగారం, కేటీఎం ద్విచక్ర వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పీ రామ్నాధ్ హెగ్డే తెలిపారు.
బుధవారం సిద్దవటం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భాకరాపేట వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, వారు తప్పించుకునేందుకు యత్నించారని చెప్పారు. వెంటనే ఎస్సై హారిక, హెడ్ కానిస్టేబుల్ అంజీ నాయక్, హోం గార్డు ప్రదీప్ కుమార్ వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.విచారణలో నిందితులు సిద్దవటం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.53/2025, ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.65/2025, 136/2025, చిత్తూరు జిల్లా బంగారుపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.66/2026, తిరుపతి జిల్లా భాకరాపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.10/2026, తమిళనాడులోని మహాలింగాపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.86/2026, కరూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.289/2026 కేసులతో పాటు గతంలో మరో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు అంగీకరించారని వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారం, ఏపీ40 జేఈ 6759 నంబర్ గల కేటీఎం ద్విచక్ర వాహనం, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా వృద్ధ మహిళలు, ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులు అద్దెకు తీసుకున్న మోటార్ సైకిళ్లను ఉపయోగించడం, నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చడం, హెల్మెట్లు, మాస్క్‌లు ధరించడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు గుర్తించామని చెప్పారు.తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వెంకటేష్ బాలమురుగన్, రామనాథపురం జిల్లాకు చెందిన ముత్తుపాండి ముత్తు రామలింగంలను కోర్టులో హాజరుపరుస్తామని ఏఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, కడప సీసీఎస్ సీఐ హాజీ వలి, సిద్దవటం ఎస్సై హారిక, ఒంటిమిట్ట ఎస్సై శ్రీనివాసులు, సిద్దవటం ఏఎస్ఐ సుబ్బరామ చంద్రతో పాటు సిద్దవటం, ఒంటిమిట్ట, సీసీఎస్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments