google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 కడప జేసీ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ నిధి మీనా...రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. డాక్టర్ నిధి మీనా.

కడప జేసీ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ నిధి మీనా...రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. డాక్టర్ నిధి మీనా.

న్యూస్ 21 తెలుగు ఛానల్: రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. వైయస్సార్ కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ నిధి మీనా. శనివారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు.జిల్లా సచివాలయం లోని జేసీ ఛాంబర్ నందు ముందుగా పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం ఉదయం 10.45 గంటలకు డా. నిధి మీనా జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలను తీసుకున్నారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా మాట్లాడుతూ.2019 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి అని, తన సొంత రాష్ట్రం రాజస్థాన్ అన్నారు. డిల్లీ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ (వైద్య శాస్త్రం) పూర్తి చేయడం జరిగిందన్నారు. గతంలో తెనాలి సబ్ కలెక్టర్ గా, వయోజన విద్య డైరెక్టర్ గా, ఎన్టీఆర్ జిల్లా జేసీగా విధులు నిర్వహించానన్నారు. కొంతకాలం మాతృత్వపు సెలవులో వెళ్లి తిరిగి ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా జేసిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. శనివారం నుంచి ప్రభుత్వం తనకు అప్పజెప్పిన విధులను, బాధ్యతలను నూరు శాతం పూర్తి చేసేలా పనిచేస్తూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు,అధికారుల సహకారంతో అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.  క్షేత్రస్థాయి లో ఎలాంటి సమస్యలు వున్నా ప్రజా ప్రతినిధులు వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే.. జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.జిల్లా లో ప్రాధాన్యమైన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు తనవంతు విధిగా కృషి చేస్తామన్నారు.రెవెన్యూ, రీ సర్వే పనులు,భూ సమస్యలు, పౌర సరఫరాలు,భూ సేకరణ తదితర ప్రధాన అంశాలతో పాటు అన్ని శాఖలను పటిష్టం చేస్తూ వాటి ఫలాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.  
ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో తాను చేపట్టిన విధులన్నింటినీ నూరు శాతం సమర్థవంతంగా పూర్తి చేయగలిగానని. తన మీద నమ్మకంతో తనను ఇక్కడ జేసిగా నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కడప జిల్లా లో నూరు శాతం  సమర్థవంతంగా పనిచేస్తానని, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు. 
అదేవిధంగా జేసీ నిధి మీనా  కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సతీమణి కావడం విశేషం.
ముందుగా నూతన జాయింట్ కలెక్టర్ నిధి మీనా. కు  డిఆర్వో విశ్వేశ్వర నాయుడు,కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్,కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్ అన్ని సెక్షన్ల పర్యవేక్షకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ఛాంబర్ కు తీసుకెళ్లారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన జేసికి డీఐపిఆర్వో పద్మజ తదితరులు పూల మొక్కలు అందించి  శుభాకాంక్షలను తెలియచేశారు.

Post a Comment

0 Comments