google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 జనసేన పార్టీ మండల అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కువైట్ కైతాన్‌లో సంక్రాంతి సంబరాలు.

జనసేన పార్టీ మండల అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కువైట్ కైతాన్‌లో సంక్రాంతి సంబరాలు.

న్యూస్ 21 తెలుగు ఛానల్: పోరుమామిళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కువైట్ దేశంలోని కైతాన్ ప్రాంతంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలు ప్రవాస భారతీయులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా ఆనందం. ఆరోగ్యం. అభివృద్ధితో నిండిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృదేశ సంస్కృతి. సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments