న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండల లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులు. వైద్య సిబ్బంది విధులకు రాకుండా ఎగనామం పెట్టారు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి కి వైద్య అధికారులు ఎవరు రాకపోవటంతో ఆస్పత్రికి వచ్చిన బాధితుల ఎన్నో అవస్థలు పడుతున్నారు.ఆదివారం సాకుతో నో లేదా విధుల పట్ల అలసత్వంతో, డాక్టర్లు సమయానికి హాజరుకాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మధ్యాహ్నం అయ్యే సరికి కూడా ఆసుపత్రిలో వైద్యులు కనిపించకపోవడంతో, చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైద్యులు, తమ బాధ్యతలను విస్మరించి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేక, ప్రభుత్వ ఆసుపత్రుల నే ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడిందని అందువల్ల వైద్య అధికారుల కోసం ఎదురవుతుండటం బాధాకరం. ఎదురు చూడవలసిన పరిస్థితి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈ పరిస్థితుల వల్ల చిన్న వ్యాధులు కూడా తీవ్రమవుతున్నాయని, సమయానికి వైద్యం అందక రోగులు ప్రాణాలపైనా ప్రమాదం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“డాక్టర్లు విధుల్లో లేకపోతే మేమెక్కడికి వెళ్లాలి పేదల ప్రాణాలకు విలువ లేదా” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి, విధులకు సక్రమంగా రాని వైద్యాధికారులపై. మరియు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక ప్రజలు కోరుతున్నారు.అలాగే ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, వైద్య అధికారులు. నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
0 Comments