న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు వీధిలో నూతనంగా 9 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను శనివారం బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య. లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు టెంకాయ కొట్టి నూతన రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం వారిని టిడిపి నాయకుడు గాలి మురళి ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి వీధి సస్యశ్యామలంగా ఉండాలని ఉద్దేశంతో నూతన సీసీ రోడ్డులను మంజూరు చేసిందన్నారు. ప్రజాభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఇమామ్ హుస్సేన్, గాలి మురళి, శంకర్ రెడ్డి, జనార్ధన్, ప్రొఫెసర్ భాష,.మౌలాలి, నాగరాజు శెట్టి, టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.
0 Comments