న్యూస్ 21 తెలుగు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్, పోరుమామిళ్ల ప్రాంతాల్లో రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించే దిశగా కీలక సమావేశం జరిగింది. బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ, నాగేంద్రలు మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులను కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బద్వేల్ మార్కెట్ యార్డ్‌కు సంబంధించిన సమస్యలు, పోరుమామిళ్లలో రైతు బజార్ ఏర్పాటు, బద్వేల్ రైతు బజార్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టే అంశాలపై చర్చించారు. అలాగే నిర్మాణంలో ఉన్న పోరుమామిళ్ల ఉప మార్కెట్ యార్డ్‌ను త్వరలో పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
అదేవిధంగా బద్వేల్ మార్కెట్ యార్డ్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ఆదాయ వనరులను పెంచడంతో పాటు రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశాన్ని కూడా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
0 Comments