google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్లలో ప్రైవేట్ ఆసుపత్రులు. ఆర్.ఎం.పి క్లినిక్‌ల తనిఖీలు చేసిన డాక్టర్ శ్రీవిద్య...

పోరుమామిళ్లలో ప్రైవేట్ ఆసుపత్రులు. ఆర్.ఎం.పి క్లినిక్‌ల తనిఖీలు చేసిన డాక్టర్ శ్రీవిద్య...

న్యూస్ 21 తెలుగు: గత రెండు రోజులుగా వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు. మరియు ఆర్.ఎం.పి క్లినిక్‌లను పోరుమామిళ్ల వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ విద్యా మాట్లాడుతూ.ఆర్.ఎం.పి లు తమ పేర్ల ముందు "డాక్టర్" అనే పదాన్ని ఉపయోగించరాదని సూచించారు.
అలాగే.ఆర్.ఎం.పి లు సెలైన్ బాటిల్స్ ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి వైద్య సేవలను అందించరాదని, కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని ఆదేశించారు. వైద్య నిబంధనలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె హెచ్చరించారు.అనుమతులకు మించి వైద్య సేవలు అందించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ తనిఖీల కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు. హెచ్ ఈ ఓ  రఘు రాములు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments