న్యూస్ 21 తెలుగు: ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడికి ప్రభుత్వాలు వత్తాసు పలకడంతో రకరకాల ఫీజుల వసూళ్లతో తల్లిదండ్రులకు మరణ శాసనంగా మారిందని సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు, ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానియేల్ విద్యాసంస్థల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం. గత ఏడాది కంటే 20 శాతం ఫీజులు పెంపు, స్టేషనరీ పేరుతో అక్రమ వసూళ్లు, చేయడం చాల దుర్మార్గమన్నారు .
ఒక్కో విద్యార్థి నుంచి స్టేషనరీ కింద 2 వేల నుంచి 5 వేల వరకు వసూలు అక్రమంగా వసూలు చేస్తోందని తల్లిదండ్రుల వాపోతున్నారు . అన్ని ప్రైవేట్ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలు.ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు అమలు చేయకుండా ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు.అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ జిఎల్ నరసింహ. విజయమ్మ. రవణ.తదితరులు పాల్గొన్నారు.
0 Comments