న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం, టేకూరుపేట గ్రామంలో నిర్వహించిన మొహరం పండుగ వేడుకల్లో ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్. తెలుగుదేశం పార్టీ నాయకులు భైరప్రసాద్. లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొహరం పండుగ నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ముస్లిం సోదరులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేతుల మీదుగా మొహరం గుండం వెలిగించి పండుగ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పీర్ల దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని మతాలు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ మత సామరస్యంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, ముస్లిం సోదరులు మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.