google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 ప్రజలందరూ గ్లాస్ బాటిల్స్ ను ఉపయోగించుకోవాలి...

ప్రజలందరూ గ్లాస్ బాటిల్స్ ను ఉపయోగించుకోవాలి...

వాటర్ బాటిల్స్ యూనిట్'ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి...

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'కడప స్ప్రింగ్స్ గ్లాస్ వాటర్ బాటిల్స్ యూనిట్'ను కడప ఎమ్మెల్యే మాధవి ప్రారంభించారు. కడప నగరంలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలో, మెప్మా డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో సరికొత్తగా నిర్మించిన కడప స్ప్రింగ్స్ వాటర్ గ్లాస్  బాటిల్ యూనిట్  గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే  ‌మాధవి రెడ్డి  ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ నూతన విభాగాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగర ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని గ్లాస్ బాటిల్స్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి ఈ యూనిట్ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా ఇటువంటి నూతన పరిశ్రమలు, ఉత్పత్తి యూనిట్లు రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, కూటమి ప్రభుత్వం ఇలాంటి వినూత్న ప్రాజెక్టులకు ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా విభాగం ప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments