google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 భూ కబ్జాదారులును జైలుకు పంపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్.

భూ కబ్జాదారులును జైలుకు పంపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్.

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా కాశినాయనాయన మండలం లోని 
భూ కబ్జాదారులైన బసన్న పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు.  దొంగే దొంగ దొంగ అన్న సామతిగా మీడియా సమావేశం నిర్వహించటం  హాస్యాస్పదంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, వి అన్వేష్ అన్నారు. బుధవారం ఉదయం కడప వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి. శివకుమార్, వి. అన్వేష్ మాట్లాడుతూ కాశినాయన మండల పరిధిలో అక్కింగుండ్ల సావిశెట్టిపల్లె కత్తెరగండ్ల ఇటుకలపాడు రెవెన్యూ గ్రామాలలో బసన్న పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు దాదాపు  300 ఎకరాలు ప్రభుత్వ భూములు ఇనాం మాన్యం భూములు బోగస్ ఎక్స్ మిలటరీ పట్టాలు దొంగ పాసుబుక్కులు ఆన్లైన్లో చేయించుకొని బినామీ పేర్లతో దౌర్జన్యంగా సాగు చేస్తున్నాడు.  దళితులపై భౌతిక దాడులు చేసి కేసులు నమోదు చేయించిన  వారికి పోలీసులు రక్షణ కల్పించాలా ఇటుకలపాడు గ్రామం కబ్జాదారుడు సుభ రాజేశ్వరరావు వీఆర్వో వేణుగోపాల్ కలిసి ప్రభుత్వ భూములుకు దొంగ పట్టాలు అడంగళ్లు తప్పుడు రికార్డులు సృష్టించి బద్వేలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో యనమల రాములు ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు‌. వారు బుధవారం పోరుమామిళ్లలో
విలేకరుల సమావేశం పెట్టి అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బసన్న పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు కొండరాజు పల్లి చెరువును ఆక్రమించి సాగు చేస్తే ప్రస్తుత ఆర్డిఓ చంద్ర మోహన్ బోర్లు సీజ్ చేసి కరెంట్ కట్  చేయడం జరిగింది. ఇటువంటివారు మీడియా దృష్టికి వస్తున్నారంటే రెవెన్యూ యంత్రాంగం  ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు  నమోదు చేయకుండా వదిలి పెట్టడం వల్లనే బరితెగించారు అన్నారు.
ఇటుకలపాడు గ్రామానికి చెందిన గంజికుంట సుభరాజేశ్వరరావు, యనమల రాములు ఆమె ప్రకాశం జిల్లా సియాస్ పురం మండలానికి చెందినది. కానీ ఇటుకలపాడు గ్రామంలో నివాసం ఉన్నదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యనమల రాములు ఆమె ఇటుకలపాడు గ్రామా నివాసి కాదు  అని ఆధారాలతో సహా  నిరూపిస్తామన్నారు. 
సుబ్బరాజేశ్వరరావు విఆర్ఓ వేణుగోపాల్ 2019 ఇంచార్జి తాసిల్దార్ సుధీర్ కుమ్ముకై  సర్వే నెంబర్ 458 ప్రభుత్వ భూమికి తప్పుడు పద్ధతిలో రికార్డులు సృష్టించి సుభరాజేశ్వరరావు ప్రభుత్వ భూమి 18 ఎకరాలు 40 సెంట్లు  స్వాధీనం చేసుకున్నారు అన్నారు.

Post a Comment

0 Comments