న్యూస్ 21 తెలుగు:భారత కమ్యూనిస్టు పార్టీ తలపెట్టిన రాష్ట్ర పిలుపులో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ఈనెల 24 వతేదీన వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ ఆర్డీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నామని.ఈ కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఎర్రబల్లి ప్రసాద్ రావు. పిలుపునిచ్చారు అనంతరం బి కోడూరు మండల కేంద్రంలో గోడపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి ఎర్రబెల్లి ప్రసాద్ రావు మాట్లాడుతూ గత ఎన్నికల లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, రెండు ఎకరాల బంజర భూమి ఇస్తామని ప్రకటించి ఎన్నికలు పూర్తయి రెండు సంవత్సరాల కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టనట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలని, గతంలో టిడ్కో లబ్ధిదారులు ప్రజల చేత రాష్ట్ర ప్రభుత్వాలు డీడీలు చెల్లించుకుని అవి దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పేద ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదని వారు ఆరోపించారు.బద్వేల్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో నిరుపేదలు పేదలు, బడుగు, బలహీను వర్గాలు అద్దెల్లో ఉండి ఇంటి అద్దె చెల్లించలేక పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ ఎన్నికల లో అమలు చేసిన వాగ్దానాల మేరకు అర్హులైనవారికి రేషన్ కార్డులు.పెన్షన్లు ఇవ్వాలని అంతేకాకుండా పట్టణాల్లో.గ్రామాల్లో ఎస్సీ కాలనీలలో శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు గురయ్యా. ఓబయ్య. యాగప్ప. ఓబులేసు. శేఖర్. తదితరులు పాల్గొన్నారు.
0 Comments