google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 మొక్కజొన్న రైతులకు ప్రతి ఎకరాకు 30వేలు నష్టపరిహారం ఇవ్వాలి...సిపిఐ నాయకులు డిమాండ్...

మొక్కజొన్న రైతులకు ప్రతి ఎకరాకు 30వేలు నష్టపరిహారం ఇవ్వాలి...సిపిఐ నాయకులు డిమాండ్...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని. అదేవిధంగా మొక్కజొన్న రైతులకు ప్రతి ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల సహాయ కార్యదర్శి కేశవ. లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పోరుమామిళ్ల. కలసపాడు మండలాల్లోని పలు గ్రామాలలో ని రైతులను సందర్శించి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను సిపిఐ బృందం పరిశీలించారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల, కలసపాడు, మండలంలోని  నష్టపోయిన ప్రతి రైతును ఆదుకొని ప్రభుత్వం ఎకరాకు 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.
రైతులు రాత్రి వేళలో పగలన రాత్రి అనక పందులు. మరియు పశువుల బెడదతో కాపలా ఉండి పండించిన మొక్కజొన్న పంటలు కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తిగా రైతులు నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పండించిన మొక్కజొన్న కంకులు రోడ్డుపైన ఆరబెట్టుకుని మిషన్లతో గింజలు ఆడించుకుని ఆ ధాన్యాన్ని అమ్ముకొని.డబ్బులు వస్తాయని ఆశతో రైతులు ఎదురుచూసే లోపు వర్షం పది రోజులు పాటు కురవడం ఎక్కడ వేసిన మొక్కజొన్న కంకులు అక్కడే వదిలేసే విధంగా మొలకలు రావడం, గింజలు మొత్తం తడిసి మట్టి ముద్దలా తయారు కావడం రైతు బాధలు  ఆత్మహత్యలే శరణ్యముగా మారాయన్నారు.
రాజసాహెబ్ పేట, టేకురుపేట. సూరిసిద్దుపల్లె. తెల్లపాడు.దూలం వారిపల్లె, గ్రామాలలో ఎక్కువ శాతం పంట తిన్నాదని ఆరు నెలల నుంచి కష్టపడి చేతికి అందవలసిన పంట రైతుల కళ్ళ ఎదుట తడిసి ముద్దయి పోయాయని రైతులు పోతున్నట్లు వారు ఆరోపించారు.
ఇక పోతే కౌలు రైతుల పరస్థితి వర్ణాతీతంగా మారిందని మా పరిస్థితి ఎవరికీ చెప్పాలా ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ బోరున విలపిస్తూ వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని వారన్నారు.
వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి వర్షం వలన దెబ్బతిన్న మొక్కజొన్న.వరి పంటలకు రైతులకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు  సనమాల చెన్నయ్య.ప్రసాద్.రైతులు రవీంద్రారెడ్డి. లక్ష్మీరెడ్డి. నర్సింహారెడ్డి.వెంకటేశ్వర్లు.
లక్ష్మ మయ్య. లతో పాటు రైతులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments