google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!

టెలికాన్ఫిరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్
జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ : 08562 - 246344 ఏర్పాటు.
వైయస్సార్ కడప జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను. జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. 
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి. క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం. ఆస్తి నష్టం.పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ. మండలాల వారీగా చెరువు కట్టలు. కాలువ గత్తుల పరిరక్షణపై దృష్టి పెట్టాలని. వాగులు. వంకలు. కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్.రెవెన్యూ అధికారులను ఆదేశించారు.జిల్లా అధికారులు. నియోజకవర్గ. మండల.సచివాలయ. గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలన్నారు.

Post a Comment

0 Comments