google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 కడపలో ఘనంగా జాప్ 33 వ వ్యవస్థాపక వార్షిక దినోత్సవం.

కడపలో ఘనంగా జాప్ 33 వ వ్యవస్థాపక వార్షిక దినోత్సవం.

వైయస్సార్ కడప జిల్లా: జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ సారద్యంలో  జర్నలిస్టుల పక్షాన నిరంతరం పోరాడుతున్న జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  (జాప్) వ్యవస్థాపక వార్షిక దినోత్సవాన్ని బుధవారం కడప లోని జాప్ మీడియ సెంటర్ ఘనంగా నిర్వహించడం జరిగింది. మీడియా సెంటర్లో జాప్   కేక్ కట్ చేసి జాప్ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జర్నలిస్టు సమస్యలపై వాటి పరిష్కారం కొరకు అవలంబించాల్సిన విధానాలపై చర్చించడం జరిగింది. అనంతరం  కడప నగరంలోని కారుణ్య వృద్ధాశ్రమం నందు జాప్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాప్  స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్వి సూర్యనారాయణ రెడ్డి. కడప జిల్లా అధ్యక్షులు మాదాల. వెంకటేశ్వర్లు. మాజీ అధ్యక్షులు ఎస్వి రమణ తోపాటు భరత్ కుమార్ రెడ్డి.మొల్ల ప్రభ రామాంజులు.రామ ప్రతాపరెడ్డి.మైదుకూరు వెంకటేశ్వర్లు.బద్వేల్ మురళి. దేవదానం.బాబు రావు నాయుడు.మల్లికార్జున.చిట్టిబాబు. బద్రి,విజయ్.కంబన్న.గంగాధర్ రెడ్డి. బాలచంద్రుడు.సిగ శ్రీనివాసులు నరసయ్య,తో పాటు జాప్ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.



 

Post a Comment

0 Comments