వైయస్సార్ కడప జిల్లా. కలసపాడు మండలం లో ని ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య అధికారి విధులకు సక్రమంగా రావడం లేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కలసపాడు మండల కార్యదర్శి సునీల్ ఆరోపించారు. విధులకు సక్రమంగా రాని వైద్యాధికారిని సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్యులు మధ్యాహ్నం సమయం అయినప్పటికీ హాస్పటల్ కు విధులకు రాకుండా తన సొంత పనులు చేసుకుంటూ హాస్పటల్లో రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనివలన రోగులు ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల సైతం ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళేందుకు స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడిందని. అటువంటి పేదలకు వైద్య సేవలను అందించవలసిన వైద్య అధికారులు విధులకు సక్రమంగా రాకుండా ఎగనామం పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైద్యులు సరైన సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా ఎవరు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. విధులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ వైద్యాధికారిపై జిల్లా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకొని, విధుల నుంచి తొలగించాలని , అలాగే హాస్పటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రోగులకు అన్ని విధాలుగా డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments