న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా కాశినాయన మండలం లోని గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితో పాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
0 Comments