google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 గ్రామ సభలు...పల్లె నిద్ర లు సైతం గ్రామాలను సందర్శించాలి...

గ్రామ సభలు...పల్లె నిద్ర లు సైతం గ్రామాలను సందర్శించాలి...

రౌడీ షీటర్లు... ట్రబుల్ మాంగర్లు...గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలి...

అసాంఘిక కార్యకలాపాలైన మట్కా...క్రికెట్ బెట్టింగ్...గ్యాంబ్లింగ్ ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలి...

మహిళా భద్రత...గంజాయి... డ్రగ్స్ నిర్మూలన... రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత...  

కడప పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో  కడప ఎస్పీ  షెల్కే నచికేత్ విశ్వనాథ్...

న్యూస్ 21 తెలుగు: గ్రామ సభలు. పల్లె నిద్ర లు సైతం గ్రామాలను సందర్శించాలని. రౌడీ షీటర్లు. ట్రబుల్ మాంగర్లు.గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని.మట్కా. క్రికెట్ బెట్టింగ్. గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని వైయస్సార్ కడప జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్ - డివిజన్ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కడప జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సభలు, పల్లె నిద్ర. గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా. స్వేచ్ఛాయుతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా రౌడీ షీటర్లు. ట్రబుల్ మాంగర్లు. గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా.క్రికెట్ బెట్టింగ్. గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.భూ వివాదాలు.ఆర్ధిక పరమైన అంశాల వలన క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల మరియు లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు.
డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి.ఇతర మత్తు పదార్థాలు. బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.శక్తి టీముల డే బీట్స్ పర్యవేక్షిస్తూ స్కూళ్ళు.కాలేజీలు.ఆఫీస్ లు.వ్యాపార సముదాయాల వద్ద.రద్దీ ప్రాంతాలలో తప్పనిసరిగా పోలీస్ సిబ్బంది బీట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి ఆదేశించారు. స్కూళ్ళు.కాలేజీలలో మహిళా భద్రత పై సోషల్ మీడియా వల్ల కలిగే మహిళలు. బాలికల వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు.ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని.ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా రిసెప్షనిస్ట్ ల ద్వారా మహిళల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.దొంగతనాల నేర చరిత్ర కలిగిన వారి కదలికలపై నిఘా ఉంచాలని. వివిధ రకాలైన.వివిధ ప్రాంతాలలో జరిగే దొంగతనాలను మ్యాపింగ్ చేసి సదరు ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేయాలన్నారు.గ్యాంబ్లింగ్. మట్కా. క్రికెట్ బెట్టింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని. దాడులు ఉధృతం చేయాలని ఆయన అన్నారు.ఏ.పి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు షాపులు.లాడ్జిలు.హోటళ్లు.వాణిజ్య సముదాయాలు.అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని. వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని జిల్లాఎస్పీ ఆదేశించారు.
వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై. హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్.ఓవర్ స్పీడ్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.సమావేశంలో కడప డి.ఎస్.పి  ఎ.వెంకటేశ్వర్లు.సబ్ డివిజన్ లోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు. సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments