ద్విచక్ర వాహనాలను తనిఖీ చేపట్టిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు...
న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలో ని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మంగళవారం ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేపట్టి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీ లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు మాట్లాడుతూ ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణ పాటించాలని. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. మైనర్ లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. యువత ఓవర్ స్పీడ్, ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని, డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరమని ఆయన తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు
0 Comments