google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 అంబేద్కర్ ఆశయాలతోనే సామాజిక మార్పు సాధ్యం.

అంబేద్కర్ ఆశయాలతోనే సామాజిక మార్పు సాధ్యం.

జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య.

న్యూస్ 21 ​తెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల  మండల జనసేన అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ, అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని, ఆయన యావత్ ప్రపంచానికే స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు.
​ముఖ్యంగా అంబేద్కర్ గారు ప్రబోధించిన "చదువుకో, సంఘటించు, పోరాడు" అనే నినాదం నేటి యువతకు ఎంతో అవసరమని, విద్య ద్వారానే అణగారిన వర్గాల తలరాతలు మారుతాయని ఆయన పేర్కొన్నారు. సమాజంలో కులమతాల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వం, సౌభ్రాతృత్వంతో మెలిగినప్పుడే అంబేద్కర్ కలలుగన్న నవభారతం సాధ్యమవుతుందని, ఆ దిశగానే జనసేన పార్టీ అడుగులు వేస్తోందని లక్ష్మయ్య గారు స్పష్టం చేశారు.
​ఒక సమాజం సాధించిన ప్రగతిని ఆ సమాజంలోని మహిళలు సాధించిన అభివృద్ధిని బట్టే తాను కొలుస్తానని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ, సామాజిక న్యాయం కోసం పోరాడటమే మనం ఆ మహనీయుడికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు

Post a Comment

0 Comments