న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా పంచాయతీ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రామచంద్ర ను జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు గౌరవ పూర్వకంగా కలిశారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అమలు చేసే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువకు తీసుకెళ్లడానికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ రథం మరియు శానిటేషన్ కార్యక్రమమును విజయవంతముగా పూర్తి చేయడానికి తగు సూచనలు సలహాలతో ముందుకు వెళ్లి ప్రజలలో ప్రభుత్వం పట్ల అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పట్ల గౌరవ ప్రదమైన స్థానం దక్కేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు టి.విన్సెంట్ కుమార్, సి రమేష్ బాబు, ఆర్. సాల్మన్ రాజూ.ఆర్.రఘునాథరెడ్డి మరియు శ్రీనివాసులు.గిరి.రహీం తదితరులు పాల్గొన్నారు.
0 Comments