న్యూజెర్సీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు...
బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్...
న్యూస్ 21 తెలుగు: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తిరుపతి జిల్లా. తిరుపతి సమగ్ర అభివృద్ధికి సంబంధించిన రెండు అత్యంత కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ తెలిపారు.
ఈ సమావేశంలో తిరుపతి నగర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమైన క్రింది రెండు అంశాలను ప్రవాసాంధ్రుల దృష్టికి తీసుకువెళ్లారు.
తిరుమల తిరుపతి డెవలప్‌మెంట్ ట్రస్ట్
టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 13వ ట్రస్ట్‌గా "తిరుమల తిరుపతి డెవలప్‌మెంట్ ట్రస్ట్ "
టిటిడిటి ఏర్పాటు చేసి, తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు
ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని కేంద్రంగా చేసుకుని ప్రత్యేక "బాలాజీ రైల్వే డివిజన్" ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే సేవలను విస్తరించడంతో పాటు, తిరుపతి, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విశేష ఊతం లభిస్తుందని సమావేశంలో వివరించారు.
ఈ రెండు కీలక అంశాలపై ప్రవాసాంధ్రులకు సమగ్ర అవగాహన కల్పించగా, వారు ముక్తకంఠంతో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తిరుపతి అభివృద్ధికి అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి డెవలప్‌మెంట్ ట్రస్ట్ టిటిడిటి ఏర్పాటు మరియు బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం తమవంతు కృషి చేయడంతో పాటు, అవసరమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మురళీకృష్ణ కాతారి, రవీంద్ర విశ్వనాథ్, రాజేష్ కలసపాటి, శ్రీధర చిల్లర, సురేశ్ బొట్టు, ప్రసాద్ యెర్నేని, గురుప్రసాద్ ఇరివిచెట్టి, తులసి సోమలరాజు, రవీందర్ అకిరాల, ఉషారాణి కావేరి తదితర ప్రవాసాంధ్రులు పాల్గొని తమ విలువైన సూచనలు, అభిప్రాయాలను వెల్లడిస్తూ తిరుపతి అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో తిరుపతి అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, బాలాజీ రైల్వే డివిజన్ మరియు తిరుమల తిరుపతి డెవలప్‌మెంట్ ట్రస్ట్ టి టి డిటి ఏర్పాటు లక్ష్యాల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
0 Comments