న్యూస్ 21 తెలుగు ఛానల్: కింగ్ పిన్ ఆధ్వర్యంలో నడిచిన డిజిటల్ అరెస్టు సైబర్ మోసం కేసు ను పోలీసులు చేదించారు. కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బద్వేల్ అర్బన్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదు అయిన క్రైమ్ నెంబర్ 450/2025 కేసులో, కింగ్‌పిన్ ఆధ్వర్యంలో నడిచిన, అత్యంత వ్యవస్థీకృత “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసం గ్యాంగ్‌ను, విస్తృత ఇంటర్-స్టేట్, మ్యూల్ అకౌంట్ నెట్‌వర్క్ మరియు క్రిప్టో కరెన్సీ లాండరింగ్ మౌలిక సదుపాయాలతో సహా విజయవంతంగా ఛేదించడం జరిగిందన్నారు.ఈ కేసు భారతీయ న్యాయ సంహిత, 2023 లోని సంబంధిత సెక్షన్లు మరియు ఐటి యాక్ట్, 2000 లోని సెక్షన్ 66(D) కింద నమోదు చేయబడింది. ఈ కేసు వివరాలకు సంబంధించి బద్వేల్ పట్టణానికి చెందిన 70 సంవత్సరాల వయస్సు గల న్యాయవాది పి.వి.ఎన్. ప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడింది. సైబర్ నేరగాళ్లు పోలీస్ మరియు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తూ, బాధితుడిని కల్పిత “డిజిటల్ అరెస్ట్” లో ఉంచి వ్యవస్థీకృతంగా మోసానికి గురి చేశారు.నకిలీ సుప్రీంకోర్టు పత్రాలు, తప్పుడు క్రిమినల్ కేసుల భయం, అరెస్ట్ మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ బెదిరింపులతో పాటు నిరంతర డిజిటల్ నిఘా ద్వారా, 08.09.2025 నుండి 04.12.2025 వరకు పిర్యాది నుండి మొత్తం రూ.72,68,039/-లను బలవంతంగా వసూలు చేశారు.మోసం నిర్వహణ విధానం
దర్యాప్తులో ఈ నేరం ఒక ప్రొఫెషనల్ సైబర్ సిండికేట్ ద్వారా క్రింది విధంగా అమలు చేయబడినట్లు తెలిందన్నారు.
పోలీస్ మరియు కేంద్ర సంస్థలుగా ఉన్నత స్థాయి అనుకరణ అరెస్ట్, ఎన్ డబ్ల్యు ఎన్‌కౌంటర్ భయాన్ని సృష్టించే మానసిక ఒత్తిడి,
వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా నిరంతర నిఘాతో “డిజిటల్ అరెస్ట్” అమలు,
మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధుల మార్గదర్శనం,చివరగా నిధులను క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌లు మరియు వాలెట్లలోకి మార్పిడి చేసి దాచడమన్నారు. తమ ఆదేశాల మేరకు మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో, కడప సైబర్ క్రైమ్ సెల్ ఇన్‌స్పెక్టర్ మరియు ప్రత్యేక బృందాలు కలిసి, సైబర్ ఫోరెన్సిక్స్, బ్యాంకింగ్ ఇంటెలిజెన్స్, టెలికాం విశ్లేషణ ద్వారా ఈ గ్యాంగ్ యొక్క ఆర్థిక వెన్నెముకను పూర్తిగా ఛేదించారు. దీనిలో భాగంగా 14-01-2026వ తేదిన బద్వేల్ పట్టణంలోని హనుమాన్ సర్కిల్, బద్వేల్–కడప ప్రధాన రహదారి వద్ద, A7 నుండి A15 వరకు మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. ఈ కేసులో అరెస్టు చేయబడిన నిందితులు హద్దాద్ కోయ (కేరళ) ప్రధాన సమన్వయకర్త, మ్యూల్ అకౌంట్‌ల సమీకరణకర్త, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఆపరేటర్. మోసానికి సంబంధించిన రూ.10,00,000/- మొత్తం స్వీకరించిన నిందితుడు.
సహాద్ థైకండియిల్ (కేరళ) – ప్రధాన “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసం నిర్వాహకుడు, నెట్‌వర్క్ హ్యాండ్లర్, నకిలీ వ్యక్తిత్వం (ఇంపర్సనేషన్) వ్యూహకర్త. అన్నారు.గిబ్సన్ గిల్బర్ట్ (కేరళ) – కార్పొరేట్ మ్యూల్ అకౌంట్ హోల్డర్ (జి ఐ) (జి ఐ) ప్రేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్‌ఇండ్ బ్యాంక్).
ప్రజిత్ సి.పి (కేరళ) – మ్యూల్ అకౌంట్ క్యారియర్, అకౌంట్ హోల్డర్లకు మరియు నెట్‌వర్క్ ఆపరేటర్లకు మధ్య లైజన్‌గా వ్యవహరించిన నిందితుడు. షాజిల్ కనాయి (కేరళ) – మ్యూల్ అకౌంట్‌ల ఏర్పాటు, పత్రాల నిర్వహణ (డాక్యుమెంట్ హ్యాండ్లర్)లో కీలక పాత్ర పోషించిన నిందితుడు. అన్నాపురెడ్డి పోతురాజు (ఆంధ్రప్రదేశ్) – కరూర్ వైశ్యా బ్యాంక్ మ్యూల్ అకౌంట్ హోల్డర్; రూ.6,00,000/- మొత్తం మళ్లించబడినది. భూపతి ప్రశాంత్ (ఆంధ్రప్రదేశ్) – బహుళ బ్యాంక్ అకౌంట్‌ల సరఫరాదారు, అంతర్రాష్ట్ర మ్యూల్ అకౌంట్ రిక్రూటర్.
మల్లెల్ దినేష్ @ దినేష్ (ఆంధ్రప్రదేశ్) – కరూర్ వైశ్యా బ్యాంక్ మ్యూల్ అకౌంట్ హోల్డర్; రూ.8,72,719/- మొత్తం మళ్లించబడినది.
గర్ల సుధీర్ (ఆంధ్రప్రదేశ్) – మోసాలకు వినియోగించిన మ్యూల్ అకౌంట్‌ల ఆపరేటర్ మరియు సౌకర్యదాత (ఫెసిలిటేటర్).
ఈ ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకొన్న ప్రాపర్టీ క్రింద పేర్కొన్న నేరారోపణకు సంబంధించిన సామగ్రి, సిండికేట్ యొక్క ఆపరేషనల్ పరికరాలుగా భావించబడుతూ, పంచనామా ప్రక్రియ ద్వారా సీజ్ చేయబడిందన్నారు.నగదు: రూ.5,50,000/-
మొబైల్ పరికరాలు: 14 స్మార్ట్‌ఫోన్లు మరియు కీప్యాడ్ ఫోన్లు సిమ్ కార్డులు: అనేక ఎయిర్‌టెల్, జియో మరియు వి ఐ సిమ్‌లు.
డెబిట్ / క్రెడిట్ కార్డులు: వివిధ బ్యాంకులకు చెందిన 9 కార్డులు బ్యాంకింగ్ పరికరాలను. చెక్ బుక్స్, ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్.కేఎల్ -XXXX-4980 నంబర్ గల హోండా అమేజ్ కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ కేసు విజయవంతమైన ఛేదింపులో కీలక పాత్ర పోషించిన బద్వేల్ అర్బన్ పోలీస్ సిబ్బంది మరియు కడప సైబర్ క్రైమ్ యూనిట్ యొక్క అంకితభావాన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రశంసించారు.బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్.
బద్వేల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. లింగప్ప,
హెచ్ సి -1364 కె. శ్రీనివాస రావు, పీసీ -988 సి. శివశంకర్ రావు, పి సి -621 కె. ఒబులేసు, ఏ ఆర్ పి సి -3272 టి. అంజనేయ ప్రసాద్ (డ్రైవర్)
సైబర్ క్రైమ్ యూనిట్ కడప.
సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మధు మల్లేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ సబ్-ఇన్స్పెక్టర్ వి.నారాయణ, పిసి 734 ఇ.వి సుబ్బరాయుడు,పీసీ -1600 డి. నాగేంద్ర ప్రసాద్, పిసి -2056 జి. తాజుద్దీన్, పీసీ -3304 –పి. అరుణ్ కుమార్. లు
వీరి అసాధారణ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
0 Comments