కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.అనంతరం పార్టీ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగాలని, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకాన్ని పొందేలా సేవా కార్యక్రమాలు చేపట్టి పార్టీని బలంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
రాబోయే కాలంలో యువతను, మహిళలను ఎక్కువగా పార్టీలోకి ఆకర్షించి, ప్రజల మధ్య నిరంతరం ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. నూతన సంవత్సరం పార్టీకి శుభారంభంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శీలంశెట్టి లక్ష్మయ్య సతీమణి విజయలక్ష్మి, బీజేపీ నాయకులు, కోటపాటి. వెంకటేష్, నగిరి. రమణయ్య, రామ్మోహన్, వెంకటసుబ్బయ్య, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments