google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 మోంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తత అవసరం...

మోంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తత అవసరం...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల : మోంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ ఆదిశేషిరెడ్డి పేర్కొన్నారు.  మోంథా తుఫాన్ అప్రమత్తతపై ఆయన సోమవారం మధ్యాహ్నం స్త్రీ శక్తి భవన్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ అప్రమత్తతపై ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుందన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం తాగునీరు వంటి అంశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువులు కాలువలు చెక్ డాములు వద్ద నిరంతరము అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే అవసరమైనచోట్ల తుఫాను పునరావాస కేంద్రాలను గుర్తించి ఉంచుకోవాలన్నారు. సచివాలయాల్లోని సిబ్బంది ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని సూచించారు. రెవిన్యూ మండల పరిషత్ అధికారులు కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారని, అవసరమైన వారు వినియోగించుకోవాలని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే హెల్ప్ లైన్ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Post a Comment

0 Comments