వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ వి.వి. నరసింహా రెడ్డి అధ్యక్షతన జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజలందరికి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మరియు డ్రగ్స్ మరియు గుట్కా ల నియంత్రణ అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా బద్వేల్ పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లింగప్ప మాట్లాడుతూ
గుట్కా మరియు మాదకద్రవ్యాలు వంటివి అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. అదేవిధంగా జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన జీఎస్టీ కంటే అధిక జీఎస్టీ వసూలు చేసినట్లయితే తమకు తెలియజేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.సి.టి.ఓ లు శ్రీనివాసులు.ప్రవీణ్ కుమార్.సిడిపిఓ శ్రీదేవి. సీఎంఎం కళ్యాణ్ బాబు.మెప్మా సిబ్బంది.వార్డు మహిళా పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments