google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు:రవీంద్రారెడ్డి.

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు:రవీంద్రారెడ్డి.

న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా పొరుమామిళ్ల పట్టణం లోని పద్మావతి కల్యాణ మండపంలో  బుధవారం సాయిరాం జూనియర్ కళాశాల ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి హాజరయ్యారు. కళాశాల యాజమాన్యం ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని విద్యార్థులు రాబోతున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఒక పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. మంచి ఫలితాలు సాధిస్తే చదివిన కళాశాలకు తల్లిదండ్రులకు, బద్వేల్ నియోజకవర్గానికి మంచి పేరు వస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే మొదటి అడుగు ఇంటర్మీడియట్ అన్నారు. కావున ప్రతి విద్యార్థి ఈ దశలో నిర్లక్ష్యం వహించకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. సాయిరాం కళాశాల యాజమాన్యం కూడా గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులకు మంచి విద్య బోధనతో పాటు క్రమశిక్షణ అందిస్తూ పట్టణంలోనే మంచి పేరు సంపాదించింది అన్నారు. ఇదే ఉత్సాహంతో కళాశాల ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments