న్యూస్ 21 తెలుగు ఛానల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యాలను బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి స్థాయిని పూర్తిగా మరచి,సభ్య సమాజం తలదించుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం అత్యంత బాధాకరమన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజమేనని, అలాగని వ్యక్తిగత దూషణలకు వెళ్లడం రాజకీయ సంస్కృతికి మచ్చగా మారుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైకాపా నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే ధైర్యం లేక దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, నీచ రాజకీయాలు చేసే వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అంబటి రాంబాబు తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
0 Comments