పోరుమామిళ్ల లోని 50 పడగల ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంతాల సైతం ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాం...డి.డి.ఓ గా బాధ్యతలు తీసుకున్న సి. శివకృష్ణ వెల్లడి...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతవరకు డాక్టర్ల కొరత ఉందని. అయినా కూడా గ్రామీణ ప్రాంతాల సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆసుపత్రికి వచ్చిన వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందిస్తున్నామని డి.డి.ఓ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న సి. శివకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యా ప్రతి నిధితో మాట్లాడుతూ
50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా ఈనెల 22వ తేదీన ప్రమోషన్ పై డి.డి.ఓ గా బాధ్యతలు తీసుకున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా ముందుగా ఈ ఆస్పత్రిలో వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. కానీ ఈ 50 పడకల ప్రభుత్వాసుపత్రి కి వచ్చిన వ్యాధిగ్రస్తులకు సక్రమంగా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. కానీ ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదు మంది డాక్టర్లు కొరత ఉందన్నారు. అందులో జనరల్ మెడిసిన్ డాక్టర్. గైనకాలజిస్ట్. (కాన్పుల డాక్టర్) సర్జరీ డాక్టర్. మత్తు డాక్టర్. చెవి డాక్టర్. తోపాటు గ్రేడ్1 ఫార్మసిస్టు. గ్రేట్ 2 ఫార్మాసిస్టు కాళీ ఉండగా. అందులో గ్రేడ్ 2 ఫార్మసిస్టు ఇన్చార్జిగా ఉన్నారన్నారు. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఉండవలసి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఈ ఆసుపత్రిలో విధులను నిర్వహిస్తున్న డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని ఆస్పత్రి కి వచ్చిన వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందిస్తున్నామని ఆయన వివరించారు.

Post a Comment

0 Comments