వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని పోలీస్ సర్కిల్ పరిధిలోని కలసపాడు, పోరుమామిళ్ల, కాశి నాయన మండల ప్రజలు తుఫాను ప్రభావంతో జాగ్రత్తగా ఉండాలని పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం సోమ, మంగళ, బుధవారం లలో తుఫాన్ ప్రభావం ఉన్నందున కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన మండల పరిధిలోని ప్రజలకు పోలీసు ద్వారా తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాత ఇళ్ళు, మట్టి మిద్దెలు కూలడానికి/పడిపోవడానికి అవకాశమున్నందున మరియు అందువల్ల ఏమైనా జరగడానికి అవకాశం ఉన్నందున అలాంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు దయచేసి అక్కడ ఖాళీ చేసి మీకు దగ్గరలోని సురక్షితమైన ప్రదేశంలోఇళ్లలో ఉండాలని ఆయన కోరారు. అదేవిధంగా ఇళ్ల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ తడి చేతులతో లేక తడి బట్టలతో కరెంటు ఆన్, ఆఫ్ చేయడం ప్రమాదకరం. అలాగే ఎక్కడైనా వంకలు, వాగులు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఏమైనా పోలీసు సహాయార్థం కోసం 9121100630 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలి అదేవిధంగా మూడు మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోరుమామిళ్ల పట్టణం లోనీ స్త్రీ శక్తి భవన్, రంగసముద్రం సచివాలయం, కలసపాడులో బాలుర ఉన్నత పాఠశాలలో పునరావసకేంద్రం లను ఏర్పాటు చేయడం జరిగింద ఆయన తెలిపారు.
0 Comments