కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై. పోలీసులు అక్రమ కేసులను పెడుతూ జైలుకు పంపుతూ భయభ్రాంతులను చేస్తూ వైసిపి కార్యకర్తలపై దౌర్జన్యాలు. హత్యలు చేయడం. తిరిగి వారి పైన కేసులు పెట్టడం కొంతమంది పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ముకాస్తున్నారని. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతున్నదని.అందులో భాగంగా వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వం మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి. రంగసముద్రం సర్పంచ్ చిత్త రవి ప్రకాష్ రెడ్డి.జడ్పిటిసి ముత్యాల ప్రసాద్. డాక్టర్ కళ్యాణ చక్రవర్తి. జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజీవ్ భాష. చిత్త గిరి ప్రణీత్ రెడ్డి.మండల ఉపాధ్యక్షులు చెన్నూ రాజశేఖర్. వైసిపి జిల్లా కార్యదర్శి చపాటీ నారాయణ రెడ్డి. చవ్వా వెంగళరెడ్డి. గానుగపెంట సర్పంచ్ వీరభద్రుడు ఎంపీటీసీ కృష్ణారెడ్డి. టేకురుపేట సర్పంచ్ రమణారెడ్డి. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ జిల్లా ఉపాధ్యక్షులు చపాటీ సాయి నారాయణరెడ్డి. కూటమి ప్రభుత్వంపై దశ ద్వజ మెత్తారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ జైలుకు పంపడం. ఈ విషయమే హైకోర్టులో అనేక సందర్భాల్లో పోలీసు వారిని తప్పు పట్టడం జరుగుతున్నదని. కానీ అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారని. రెండు రోజుల క్రితం కడపలో మాజీ మంత్రి అంజాద్ భాష. సోదరునిపై. అక్రమంగా కేసు పెట్టడం జరిగిందన్నారు. ఈ విషయం ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎస్పీ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వి ఆర్ కు. పంపడం జరిగిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా అజిత్ అంజాద్ భాష.పిఏ ను అరెస్టు చేసి జిల్లా కోర్టుకు హాజరుపరచగా జడ్జి ఈ విషయంపై సీరియస్ కావడం జరిగిందన్నారు.రాష్ట్రంలో కొద్దిమంది పోలీస్ అధికారులు మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని. అలాగే అధికార పార్టీ లోని కొద్ది మంది నాయకులు మాత్రమే ఇలా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుందని ఆయన అన్నారు. ఒక సంవత్సరం ముందుగానే జెమిని ఎన్నికలు రావడం జరుగుతుందని. మరో రెండేళ్లు అధికారంలో ఉంటారని. ఎన్నికలకు ముందు ఆరు నెలలు ఎన్నికల కోడ్ వస్తుందని కావున ఈ ఒకటిన్నర సంవత్సరంలో అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని. అలా చేయని పక్షంలో. పార్టీ అధ్యక్షులు జగనన్న చెప్పిన విధంగా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినవారిని. ఎక్కడ ఉన్నా వదిలేది లేదని. పదవీ విరమణ అయినప్పటికీ కూడా సప్త సముద్రాలు అవతల ఉన్న వారిని చట్ట ప్రకారం చర్య తీసుకుని కోర్టు ముందు హాజరు పరుస్తామని ఆయన హెచ్చరించారు. కావున ఇప్పుడు డిజిటల్ బుక్కు లో ఎక్కడ వైసిపి వారికి అన్యాయం జరిగితే.వారు. ఈ డిజిటల్ బుక్కును ఉపయోగించుకోవాలని. కావున పోరుమామిళ్ల మండలంలో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్. రాజారెడ్డి. ఎంపీటీసీ మహబూబ్ బాషా. డాక్టర్ మాబు. వార్డు మెంబర్ హుస్సేన్ పీరా. జెకె. మస్తాన్. శేఖర్. ప్రసాద్. మరియు.వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments