చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, దేవళంపేటలో.. గురువారం రాత్రి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం పై తక్షణం స్పందించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.ప్రపంచ మేధావిని అవమానపరుస్తూ.. ఆ మహనీయుని విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. భారత రాజ్యాంగాన్ని రచించి.దేశానికి మార్గ నిర్దేశం చేసి.సంఘ సంస్కర్తగా కుల నిర్మూల కోసం పోరాడటంతో పాటు దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఘనతను ప్రపంచం కీర్తిస్తుంటే భారతీయ పౌరులమైన మనము ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
అంబేద్కర్ కాంస్య విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ తప్పు పట్టాలని.ఐక్యంగా ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు
పునరావృతం కాకుండా పోలీస్ ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు
0 Comments