న్యూస్ 21 తెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమము ప్రతినెల మూడవ శనివారము జరుగు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలో గిరినగర్ కాలనీలో రోడ్లపై ఉన్నటువంటి చెత్తాచెదారాలను మరియు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలను అలాగే మురుగు కాలువల లో ఉన్నటువంటి చెత్తాచెదారాలను తొలగించడం జరిగినది. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో టి.విన్సెంట్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ మన చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రసాద్ రెడ్డి, మురళి, భాష, ప్రసాద్ పాల్గొన్నారు
0 Comments