google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల పట్టణంలో ప్రపంచ జనాభా దినోత్సవం పై అవగాహన ర్యాలీ.

పోరుమామిళ్ల పట్టణంలో ప్రపంచ జనాభా దినోత్సవం పై అవగాహన ర్యాలీ.

న్యూస్ 21 తెలుగు: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని కో-లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలోని పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ "నేటి మరియు భావి తరాల కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం" అనే భావనను ప్రజలకు వివరించారు. యువతకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, సరైన సమాచారం మరియు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారు ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుని సమాజాభివృద్ధికి తోడ్పడగలరని వారు తెలిపారు. అలాగే కుటుంబ నియంత్రణ, తల్లి–శిశు ఆరోగ్యం, యుక్తవయసుల ఆరోగ్య పరిరక్షణ, చిన్న కుటుంబం–సంతోషకర కుటుంబం అనే సందేశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ ర్యాలీలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఘురాములు, హెల్త్ అసిస్టెంట్లు సత్యనారాయణ, స్వామి రంగయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సిహెచ్ఓలు. ఏఎన్ఎం లు. మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments