రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని, డ్రైవర్ల కుటుంబాల భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు.ఆటో యూనియన్ నాయకులు. ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు.
0 Comments