డిసెంబర్ 6 7 తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర 9వ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 16వ తేదీన రాయలసీమ ఎనిమిది జిల్లాలతో కూడిన సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని, ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గారు రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు మరియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతుందని అందుకు సంబంధించిన కరపత్రాలను వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ని భగత్ సింగ్ నగర్ పార్టీ కార్యాలయము నందు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్. చంద్రశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్యలు మాట్లాడుతూ ప్రజలందరికి ఖాతాలో 15 లక్షల రూపాయిలు నల్లధనం తెచ్చి జమ చేస్తానని, సంవత్సరానికి రెండు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని యువతకు ఆశలు రేపి, బేటి బచావో బేటి పడావో అని మహిళలను ఆకర్పించి, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అనే అధికారంలోకి వచ్చిన బిజేపి ప్రభుత్వం ఇచ్చిన నాగ్దానాలన్నీ బూటకం అని రుజువైనాయి. దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. దీని ప్రజా వ్యతిరేక విధానాల వలనే ప్రజలకి ఉపాధి కరువవుతుంది. దేశంలో గత 70 సం॥లుగా ప్రజలు కష్టపడి చేనుటోడ్చి పైసా పైసా కూడబెట్టి సంపాదించిన ఆస్తులు, స్టీల్ ప్లాంట్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, విమానాలు, రైల్వేలు, హైవేలు, బొగ్గుగనులు కలా ఒకటేమిటి సర్వసంపదలు కోటీశ్వరులకు తేరగా కట్టబెడుతున్నారు. అదిదాలక మనలను తాకట్టు పెట్టి మోడీ ప్రభుత్వం 83 లక్షలకోట్ల రూపాయిల అప్పుచేసి పాలనసాగిస్తున్నారు. ఎక్కడా పరిశ్రమలు. ప్రాజెక్ట్లు నిర్మించి ఉద్యోగాలు కల్పించే నిర్మాణాత్మక పనులు చేపట్టలేదు.
సుదీర్ఘకాలం జరిగిన స్వాతంత్ర పోరాటం వలన మనకు లభించిన రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి దాని స్థానంలో మనుస్మృతిని రాజ్యాంగంగా తేవాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాజ్యాంగం పౌరులందరికి స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతృత్వాన్ని కలిగిస్తే మనుస్మృతి మనుషుల మధ్య మానవీయ సంబంధాలను నిరాకరిస్తుంది. మనువాదాన్ని చేతబట్టిన శక్తులు రాజ్యాధికారాన్ని చేపట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలను రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి నియంత్రత్వ పాలన ప్రజలపై రుద్దుతున్నారు. వాటిని ఎదిరించిన, ప్రశ్నించిన శక్తులను అర్బన్ నక్సల్స్ పేరుతో తప్పుడు కేసులు నమోదు చేసి, వారి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులపై లాఠీలు, తూరాలను కురిపిస్తున్నారు. నియంతృత్వ పాలన సాగిస్తున్నారు.మనది ప్రధానంగా వ్యవసాయ దేశం ఇప్పటికి జనాభాలో నూటికి అరవై మందికి ఉపాధి ఇసున్న వ్వవసాయ ఉపకరణాలను రైతుకు అందుబాటులో రేవగానికి బదులు ముత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్లయిన వ్వంగం ఇది. అటువంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి బదులు పంటలకు మద్దతు ధరలను, ఆదాని, అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్రప్రభుత్వం తలపెట్టింది. దీనికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం వెయ్యి మంది ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన రైతాంగాన్ని అనేకవిధాల హింసలకు గురిచేసి చివరకు రైతు ఉద్యమ తాకిడికి తట్టుకోలేక మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కాటన్ వస్తువుల మీద ఉన్న పన్నులను రద్దు చేసింది. సామ్రాజ్యవాదం మనం ఎగుమతి చేసిన సరుకులకు నూటికి 50 రూ॥ల పన్ను విధించిన నోరు మెదపక మిన్నకున్నది. ఫలితంగా భారతదేశంలో పత్తి పండించిన రైతులకు అలాగే ఇక్కడ ఆక్వా రైతులకు అది శాపంగా తయారయ్యింది.నేడు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిలో వృద్ధులకు ఇచ్చిన పెన్సన్ తప్ప మిగతా సమస్యలన్నీ కీలకమైనవి ఏవి అమలు చేయలేదు. ఉదహారణకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3000 రూపాయిలు నిరుద్యోగభృతి, రైతుకు మద్దతుగా అన్నదాతకు 20 వేల రూపాయల మద్దతు. అలాగే మూడుసెంట్లు ఇళ్ల స్థలం ఇవేవి అమలు జరగడం లేదు.ఉద్యోగాలు కల్పిస్తానన్నా టిడిపి మాట అటుంచి ఉన్న ఉద్యోగాలను కూడా పీకే స్టీల్ ప్లాంట్ను అమ్మి వేస్తుంటే కళ్ళప్పగించే చూస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలైన టిడిపి వైయస్సార్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడి ప్రజలను ముంచుతున్నారు. ప్రజల మీద మమకారం కాదు. కాని అధికారదాహం ఏ సంక్షేమ పథకాలు నిండా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద పన్నుల భారంమోపి తడిసి మోపుడు చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు వైయస్సార్ సిపి ప్రభుత్వానికి ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో సేకరించిన భూములకు నేటికి పరిహారం చెల్లించకుండా రైతుల నోరు నొక్కుతున్నారు. మరలా ఈ విషయంలో భూ సేకరణను టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పేరిట రాష్ట్రంలో విమానాశ్రయాలు, విశాఖలో సుమారు 14 ఎకరాలు, విజయవాడలో సుమారు 4.5 ఎకరాల కోట్ల రూపాయిలు విలువ చేసే భూమిని కారుచూకగా ఎకరా 0.99 పైసలకు, శ్రీకాకుళంలో థర్మల్ ప్లాంట్కు వేల ఎకరాలు కార్పోరేట్లకు దారదత్తం చేసి ఎవరి అభివృద్ధి కోసమో ప్రభుత్వం సెలవివ్వాలి. ఈ విషయంలో రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకటి.యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నూతనంగా చిన్న పరిశ్రమలు స్థాపన చేపట్టకుండా ఉన్న పరిశ్రమలను అమ్ముకునటువంటి ఈ ప్రభుత్వాలు మనిషికి జీవించడానికి అవసరమైన మాములుగా వస్తువులన్నింటిని కల్పించవలసిన బాధ్యతనుండి వైదొలగిన కార్పోరేట్ కంపెనీలకు వ్యాపారం చేసుకోవడానికి వాటికి దారదత్తం చేసింది. వీరివద్ద ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కాకాలు లేవు అందుచేత ప్రజల కళ్ళు తెరవాలి. స్వేచ్ఛ, సామానత్వం, సౌభాత్రత్వం ప్రజాసామ్యంగా తెలుపుతున్న పార్టీలు అవ్వండి.పైన పేర్కొన్న సమస్యలను ఎదుర్కొంటూ పార్టీని ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి పార్టీ 9వ రాష్ట్ర మహాసభ రాయలసీమ ప్రాంతంలో కడప పట్టణంలో జరుగుతున్నది.ఈ నేపథ్యంలో నెల 16వ తేదీ జరుగు రాయలసీమ స్థాయి సమావేశంలో రాయలసీమ సమస్యలపై చర్చించి మహాసభలో తీర్మానం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అనిల్ ఏరియా కమిటీ సభ్యులు కే.బాబు, రామరాజు, జయరామరాజు, మహబూబ్ బాషా, నారాయణ, చంద్రపాల్, విజయరావు, పాండు, దేవదానం, చెన్నయ్య, శివరాం తదితరులు పాల్గొన్నారు.
0 Comments