వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల:రాబోవు ఈ మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నా నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గం ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఈదుర గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిందని ఆయన అన్నారు. కావున పొలాల్లో రైతులు విద్యుత్ తీగలను,తడి చేతులతో లేక తడి బట్టలతో ముట్టుకోరాదని ఆయన సూచించారు. పాతబడిన భవనాల్లో నివాసం ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన భరోసా కల్పించారు.
0 Comments