google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 మొంథా" తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి సన్నద్ధం గా ఉండండి.

మొంథా" తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి సన్నద్ధం గా ఉండండి.

విపత్తు నేపథ్యంలో ఈ నెల 27, 28 వ తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు - అధికారులు అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు.లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించండి.పునరావాస కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ లు 24×7 పనిచేస్తూ.షిఫ్ట్ ల వారీ గా విధులు నిర్వహిస్తూ అప్రమత్తం గా ఉండండి.మొంథా"తుఫాన్ విపత్తు నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 27, 28  వ తేదీలలోభారీ వర్షాలు కురువనున్నాయని తుఫాన్  ను ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి సన్నద్ధం గా ఉండాలని  జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్  అధికారులను ఆదేశించారు. "మొంథా"తుఫాన్ ను  ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న  చర్యలపై జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ "మొంథా" తుఫాన్ ప్రభావం  జిల్లాకు కూడా తగిలే ప్రభావం ఉన్నందున.. అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు  జిల్లా యంత్రాంగం అప్రమత్తం గా ఉన్నదన్నారు. ఈనెల 27, 28వ తేదీలలో రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు నేపథ్యంలో సమర్థవంతంగా విపత్తు నుఎదుర్కొనేందుకు వివిధ శాఖల  వారీ గారూపొందించుకున్న కార్యాచరణ  ప్రణాళికలను  సమర్థవంతంగా అమలు చేసే దిశగా పని చేయాలన్నారు."మొంథా" తుఫాన్ ప్రభావం వల్ల జిల్లా లో  ఎక్కడా కూడా ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలాల ప్రత్యేక  అధికారులు మండల స్థాయి లోని అధికారులను సమన్వయం చేసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో అవసరమైన అన్ని చర్యలు  చేపట్టే విషయంలో ఆర్డీఓ పూర్తి స్థాయి లో పర్యవేక్షించాలన్నారు. గుర్తించిన పునవాస కేంద్రాలలో మౌలిక వసతులు, త్రాగు నీరు,ఆహార సరఫరా, విద్యుత్,వైద్య సేవలు అందించాలన్నారు. ప్రమాదకర స్థాయిలో  వాగులు, వంకలు పొంగే ప్రాంతాల వైపు ప్రజలు వెళ్ల కుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలనన్నారు.అలాగే ఎఫెక్ట్ ఏరియాలలో ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు, హెల్త్ సమస్యలు ఉన్న వృద్ధులను ముందస్తు చర్యల్లో భాగంగా  సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు.వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది 24 గంటలు  వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం గా ఉండాలనన్నారు. ఈ విపత్తు నేపథ్యం లో పూర్తి స్థాయి లో జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధం గా ఉంటూ..జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి, సిబ్బంది సమష్టి కృషితో పనిచేస్తూ...ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.భారీ వర్షాల వలన 
అన్ని గ్రామాల్లో మంచినీరు, పారిశుధ్యంపై జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాగులు, వంకలు ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా  పంటలను కాపాడుకునే చర్యలతో పాటు.. చేతికందిన పంట దాన్యాన్ని గోడౌన్లలో భద్రపరుచుకోవాలన్నారు. పశుసంపదను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు.
అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఆయా మండల తహశీల్దార్లు, ఎంపీడీవోలు లతో పాటు.. సంబందిత శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బందిని తుఫాను సహాయక చర్యలకు సిద్ధం గా ఉండాలన్నారు. పీఆర్, ఆర్ & బి, గ్రామీణ నీటి పారుదల శాఖ, ట్రాన్స్కో, రెవిన్యూ, వ్యవసాయ సంబందిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు. అత్యవసర సహాయ చర్యలను అందించేందుకు. జిల్లా  కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో 24× 7 పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడమైనదన్నారు. జిల్లా కలెక్టరేట్  కార్యాలయం, కడప కంట్రోల్ రూమ్ : 08562 - 246344 ఆర్డీవో కార్యాలయం, కడప : 08562 - 295990 ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 95028 36762 ఆర్డీవో కార్యాలయం, బద్వేలు : 6301432849 ఆర్డీవో కార్యాలయం, పులివెందుల : 8919134718ఈ టెలి కాన్ఫరెన్స్ లో   ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల స్పెషల్ అధికారులు, తహశీల్దారులు కమిషనర్లు, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments