google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్.. ఏడిఏ మురళీధర్ రెడ్డి...

వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్.. ఏడిఏ మురళీధర్ రెడ్డి...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ళ: రైతులు పండించే వరి పంట ధాన్యమును కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మకాలు జరపాలని. బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ ఏడిఏ. ఎం మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పోరుమామిళ్ల మండలంలోని పోరుమామిళ్ళ రైతు సేవ కేంద్రాన్ని సమర్పించి వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంగా కేటాయించాలన్నారు.జిల్లా కలెక్టర్  ఆదేశాలు మేరకు వరి పంట పండించే రైతులు కొరకై వరి ధాన్యం సేకరణకు పోరుమామిళ్ళ రైతు సేవా కేంద్రం ను కొనుగోలు కేంద్రంగా కేటాయించి తద్వారా వరి పండించే రైతుల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయుటకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ కు 2389 రూపాయలు మరియు సాధారణ రకం క్వింటాల్ 2369 రూపాయలు గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా తేమ శాతం 17 శాతానికి మించరాదని. మరియు చెత్త,రాళ్ళు మరియు తాలు ఒక శాతానికి మించరాదని. చెడిపోయిన మరియు రంగు మారిన విత్తనాలు ఐదు శాతానికి మించరాదని. పరిపక్వానికి రాని మరియు వంకర తిరిగిన గింజలు మూడు శాతానికి మించకూడదని ఆయన రైతులను ఉద్దేశించి తెలిపారు. తదుపరి సూచనలు సలహాలు కొరకై సంబంధిత రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి వరి పండించే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల వ్యవసాయ అధికారి చంద్ర మోహన్  రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారి రవి. రైతు సేవ కేంద్ర సిబ్బంది. మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments