కువైట్ లోని కైతాన్ లో జనసేన పార్టీ స్థాపించి సంవత్సరము పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కువైట్ సైతాన్ పై కైతాన్ లో కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.విదేశాల్లో ఉన్నా జనసేన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న జనసేన పార్టీ నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య ను చూచి కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా జనసేన పార్టీ సిద్ధాంతాలను మరచిపోనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా. పోరుమామిళ్ల మండలం లోనే కాకుండా కువైట్‌లో కూడా జనసేన పార్టీ ని బలోపేతం చేయడమే నా లక్ష్యం అని ఆయన అన్నారు.కైతాన్ ప్రాంతంలో జనసేన పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. అదేవిధంగా కువైట్ లోని కైతాన్ లో ఉన్న ప్రతి భారతీయులందరం జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రణాళిక పద్దంగా నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని పార్టీ అభివృద్ధికి తోడపడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా కార్యకర్తలు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య జనసేన పార్టీ పట్ల చూపే అంకితభావం మాకు పెద్ద ప్రేరణ. అని వారన్నారు. విదేశాల్లో ఉన్నా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగు కార్యకర్తను ఒక్కరినీ వదలకుండా కలవడం, వారిని ఆదుకోవడం లో ఆయనకే సాధ్యమని ఆయనపై ప్రశంసలు కురిపించారు.ఈ కార్యక్రమంలోఎక్కలూరి మల్లి. రాళ్లపల్లి మురళి. ఎక్కలూరి నారాయణ. బద్వేల్ బాబు. చిన్న సిద్దయ్య. ఆంజనేయులు. శీను. రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.
0 Comments