google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 ప్రభలవీడులో ‘అన్నదాత సుఖీభవ – రైతన్న మీకోసం’ కార్యక్రమం...

ప్రభలవీడులో ‘అన్నదాత సుఖీభవ – రైతన్న మీకోసం’ కార్యక్రమం...

వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బి.కోడూరు మండలం ప్రభలవీడు పంచాయతీ, ప్రభలవీడు గ్రామంలో అన్నదాత సుఖీభవ, రైతన్న మీకోసం కార్యక్రమంలో టిడిపి ఇన్‌ఛార్జ్ శ్రీ రితేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకొని నేరుగా వారితో మాట్లాడి, అన్నదాత సుఖీభవ నిధులు సకాలంలో జమయ్యాయా, ఏవైనా సాంకేతిక లేదా పరిపాలన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. రైతుల సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూస్తోంది అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ రైతులకి మంచి రోజులు వచ్చాయి, అని రితేష్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, బి.కోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మండల సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శేషారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి, రవీంద్రారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments