google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 వందేమాతరం పై కాదు దేశంలో ఉన్న సమస్యలపై చర్చకు సిద్ధమా...

వందేమాతరం పై కాదు దేశంలో ఉన్న సమస్యలపై చర్చకు సిద్ధమా...

భారతదేశంలో అనేక సమస్యలు ఉన్న వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం రచించిన వందేమాతర గేయం పై పార్లమెంట్ సాక్షిగా, మత విద్వేషాలు రెచ్చగొడుతూ భారత జాతి గర్వించదగ్గ నాయకుడు నెహ్రూ ను దోషిగా చూపే విధంగా ప్రధాని మోదీ సంభాషణ ఉందని, దేశంలో ఉన్న సమస్యలపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి అన్వర్ సవాల్ విసిరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ ఈ దేశానికి అసలైన నాయకుడు విశ్వాసపాత్రుడైతే ఇప్పుడున్న ప్రధాని విశ్వాసఘాతకుడని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర ఉద్యమ పాత్రలో మచ్చుకైనా లేని బిజెపి,ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాయకులు స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రాణ త్యాగాలు చేసిన నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని స్వాతంత్రం కోసం 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి స్వాతంత్రం సాధించిన నెహ్రూ ప్రసాదించిన స్వాతంత్రంలో 12 ఏళ్లుగా పదవిలో ఉంటూ రాజ భోగాలు అనుభవిస్తున్న మోడీ నెహ్రు గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జాతీయ జెండాను కూడా గౌరవించని ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకులు వందేమాతరం గురించి చర్చించడం హాస్యాస్పదంగా ఉందని దేశంలో ఉన్న నిరుద్యోగ, విమానయాన, రైల్వేలు ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ, ఎల్ఐసి అమ్మకం ఇలాంటి అనేక సమస్యల పైన చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments