గత నెల 16న రోడ్ ప్రమాదం జరిగి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఇటీవల మరణించిన వైయస్సార్ కడప జిల్లా. జమ్మలమడుగు ఎం ఎస్ పి సీనియర్ నాయకులు సుబ్బగాల్ల నరసింహులు మాదిగ స్మృతికి నివాళులు అర్పిస్తూ.ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 28.12.25న ఆదివారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు సంతాప సభను ఏర్పాటు చేసి నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏపీ జెన్కో ఆర్టిపిపి ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. సాల్మన్ మాట్లాడుతూ నరసింహులు మాదిగ మొదట బాంబుల నరసింహులుగా పేరు పొందినప్పటికీ తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దండోరా నాయకుడిగా మారి ఉద్యమంలో కష్టపడి పని చేశారన్నారు. ఆయన మరణం ఉద్యమానికి తీరని లోటు అని చెప్పారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు పిచ్చికె బాబు మాట్లాడుతూ నరసింహులు మాదిగ ఎప్పుడు ఎవరు పిలిచిన పలికే వారిని అన్ని వర్గాల ప్రజలకు చేరువై అందరికీ సహాయం చేసేవాడని ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కె.ఎన్. రాజు మాట్లాడుతూ నరసింహులు మాదిగ కుటుంబానికి దండోరా అండగా ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దళిత నేత రెండవ మున్సిపల్ వైస్ చైర్మన్ మంగదొడ్డి సింగరయ్య, ఏపీ జెన్కో ఎంఈఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓ. నరసింహులు, నియోజకవర్గ ఇన్చార్జి వై. చిన్నయ్య, ఎంఈఎఫ్ అధ్యక్షులు కె. బాల ఓబయ్య, టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బిర్రు సంతోష్.దళిత నాయకులు మేకల ఆంజనేయులు, చిన్న గుర్రప్ప, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి నాయకులు నల్లప్ప, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆర్. బాలయ్య, ఎంఇఎఫ్ నాయకులు ఎన్.సి. ఓబులేసు, పుల్లయ్య ఎంఎస్పి నాయకులు బొంతల ఓబులేసు, శివ రాముడు, ఎమ్మార్పీఎస్ నాయకులు హరికృష్ణ , జ్ఞానేష్. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు చందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చివరిగా కష్ట కాలంలో ఆయన కుటుంబానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు
0 Comments