కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం స్థాపించి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. వైసీపీ పాలన కాలంలో 29-12-2023న ఈ పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు.ఆ రోజు నుంచి నేటి వరకు పోరుమామిళ్ల మండల జనసేన పార్టీ నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఎవరిపైనా ఆధారపడకుండా, తన సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ, పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించడం విశేషం.అలాగే ఆయన సతీమణి శీలంశెట్టి విజయలక్ష్మి 2021 సంవత్సరంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, పార్టీని వీడకుండా ఇప్పటివరకు జరిగే ప్రతి పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ రెండేళ్లుగా పార్టీ కార్యాలయం నిలబడటానికి కారణం ఒక్క వ్యక్తి కాదు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం చూపిన అంకితభావమే దీనికి పునాది. జనసేన సిద్ధాంతాలను నమ్మి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు అన్నారు.
అదేవిధంగా జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది ప్రజల ఉద్యమం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం. వచ్చే కాలంలో కూడా అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పోరుమామిళ్ల మండలంలో ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం. ఆర్థిక లాభాల కోసం కాకుండా, సమాజ మార్పు కోసమే జనసేనలో పనిచేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ సందర్భాన్ని మరింత బాధ్యతగా తీసుకుని, పోరుమామిళ్ల మండలంలో జనసేన పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మయ్య తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తే తనకు బలం, ప్రేరణ అని పేర్కొన్నారు. అందరికీ ప్రతి కుటుంబానికి ఆయన నూతన సంవత్సర 2026 వ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శీలంశెట్టి లక్ష్మయ్య, శీలంశెట్టి విజయలక్ష్మి, ఎన్. రమణయ్య, ఆర్. రామ్మోహన్, బొల్లు వెంకటసుబ్బయ్య, ఎస్. ఇమ్రాన్, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
0 Comments