న్యూస్ 21 తెలుగు ఛానల్: గోపవరం మండలం లోని వల్లేరవారి పల్లె గ్రామం లో వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు పుష్య మాసం ప్రారంభంతో 4వ తేదీ చివరి శనివారం సందర్భంగా వైభవంగా అభిషేకం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 24 వ తేది నుంచి మాఘ మాసం ప్రారంభం అవుతుందని. మాఘ మాసంలో స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు. మరియు పలు రకాల నదుల గంగా జలాలతో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం కార్యక్రమం లు ఉంటాయని మాఘ మాసంలో స్వామివారి అభిషేకం,పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి యమగండము,వాహన గండ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు,సర్ప దోషాల,రాహు కేతు దొషాలు తొలగి పోతాయని అలాగే దాంపత్య సమస్యలు,సంతాన సమస్యలు తొలగిపోయి అనుకున్న పనులు సకాలం లో నెరవేరుతాయి కావున భక్తులందరూ మాఘ మాసంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అభిషేకం,పూజ కార్యక్రమం పాల్గొని స్వామి వారి సంపూర్ణ ఆశీర్వచనం స్వామి వారి గంధం రక్ష స్వీకరించవలసినదిగా స్వామివారు తెలియజేశారు,తదుపరి స్వామి వారిని దర్శించడం కోసం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించి, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు, అన్నదాన కైంకర్యం నిర్వహించినవారు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన క్రీ"శే"నల్లపోతుల. మురళి కృష్ణ నాయుడు ధర్మపత్ని మంజుల వీరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ నరసింహ పలువురు ప్రముఖులు. గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
0 Comments