న్యూస్ 21 తెలుగు వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం పోరుమామిళ్ల వైద్య అధికారి లకిడి జయరాం. ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ (సర్వికల్ క్యాన్సర్ నివారణ) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్న బాలికలకు(ఫిబ్రవరి 28 వ తేది 2026 నాటికీ 14 వయస్సు సంవత్సరాలు వచ్చినవారు హెచ్ పి వి వ్యాక్సిన్ ఇవ్వబడింది.ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ సుప్రజ. రంగసముద్రం సర్పంచ్ చిత్త రవి ప్రకాష్ రెడ్డి. పోరుమామిళ్ల సర్పంచ్ యనమల సుధాకర్. లు ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.ప్రతి గురువారం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రతి మంగళవారం టేకురుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. అర్హత కలిగిన బాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల వైద్య సిబ్బంది రఘురామ్, నిర్మల్, సరస్వతి. రాంప్రసాద్, వెంకటరమణ ఏఎన్ఎం లు. ఎం ఎల్ హెచ్ పి. లు మరియు ఆశా కార్యకర్తలు ఆర్ రజినమ్మ. కతీజ బేగం.రిజ్వానా.సైదాబి.జరీనా.లు పాల్గొన్నారు
0 Comments