google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 నిర్లక్ష్యానికి నిదర్శనం డ్రైనేజీ పనులు లబోదిబోమంటున్న షాపు యజమానులు...

నిర్లక్ష్యానికి నిదర్శనం డ్రైనేజీ పనులు లబోదిబోమంటున్న షాపు యజమానులు...

బాడుగలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న షాపు యాజమాన్యులు... మొద్దు నిద్రలో ఉన్న అధికారులు...

అధికారులపై... కాంట్రాక్టర్లపై మండి పడుతున్న సిపిఐ నాయకులు... 

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల ప్రధాన రహదారి రోడ్డు డివైడర్ పనులు ఏళ్లు గడిచిన పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి  రవికుమార్ అన్నారు. పోరుమామిళ్ల సిపిఐ బృందంతో డ్రైనేజీ పనులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఏ షాపు ముందర రోడ్డు పని జరిగితే ఆ షాపు యజమానులు నెల రోజులు బాడుగ ఉచితంగా కట్టాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. అలాగే చిరు వ్యాపారస్తులైన తోపుడు బండ్లు, కూరగాయాలు, ఆపిల్, దానిమ్మ, చిల్లర అంగళ్లు  లాంటి  షాపుల యజమానులు ఒక మనిషి కాలువ దాటి ఇవతలికి రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి గా ఉన్నదని, ఈ రోడ్డు డివైడర్, డ్రైనేజీ పనులు ఇంక ఎన్ని ఏండ్లు కు అయిపోతుందో తెలియని పరిస్థితి గా ఉన్నదని వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారన్నారు.
ఈ రోడ్డు డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేసి పోరుమామిళ్ళ పట్టణానికి పట్టిన దరిద్రాన్ని శుభ్రం చేయాలని, ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, ఆర్ అండ్ బి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని, నట్ట నడిరోడ్డుపై డివైడర్ లో మట్టి తో పూడ్చి మొక్కలు నాటి, వీధిలైట్లు ఏర్పాటు చేసి ఉంటే  బాగుండేది. అది చేయకపోవడంతో  డ్రైనేజీ దిబ్బలకు ఏర్పాటు చేసే విధంగా  ఉన్నాయని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితిగా అధికారులను హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ, కార్యవర్గ సభ్యులు, సఫా, సునీల్, షాహిదా, పేరయ్య, మండల నాయకులు శ్రీనివాసులు, విశ్వాసమ్మ, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments