google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 ఊరి బడి లేకపోతే బడుగులకు భవిష్యత్తు లేదు...

ఊరి బడి లేకపోతే బడుగులకు భవిష్యత్తు లేదు...

ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే యుటిఎఫ్ లక్ష్యం...

ప్రాంతీయ సదస్సు కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మదన విజయకుమార్...

ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు...

న్యూస్ 21 తెలుగు: ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే పేదలకు నాణ్యమైన విద్య అందదని, తద్వారా పేదల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్. ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు. లు పేర్కొన్నారు.శనివారం సాయింత్రం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కార్యదర్శి కె.సుధాకర్ అధ్యక్షతన "ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం-ఊరి బడిని కాపాడుకుందాం" అనే అంశంపై ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు లు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడుతూ, విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు నేడు పాలకుల విధానాల ఫలితంగా ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే లక్ష్యంగా హామీలిస్తున్న పాలకవర్గాలు తీరా గద్దినెక్కాక హామీలను విస్మరిస్తూ ప్రభుత్వ విద్యారంగ నిర్వహణ బాధ్యతల నుండి క్రమేపి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. గతంలో వైసిపి ప్రభుత్వం 117 జీవోను ప్రవేశపెట్టి, పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసిందన్నారు. అప్పటి ప్రతిపక్ష హోదాలో వైసీపీ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం,తాము అధికారంలోకి రాగానే జీవో 117 ను రద్దుచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 117 స్థానంలో జీవో 20 ని అమలు చేశారే తప్ప విధానాల్లో మాత్రం మార్పు లేదన్నారు. పాలకవర్గాలు విద్యారంగ నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తూ నిరంతరం బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారన్నారు. వివిధ యాప్ ల పేరుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకుండా చేయడంలో పాలకవర్గాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల ఆదేశాల మేరకే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు విద్య అందకుండా చేస్తూ మరోవైపు ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లోకి తరలి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తున్నారన్నారు. సాల్ట్ పథకం అమలులో భాగంగా ప్రపంచ బ్యాంకు నుండి 1750 కోట్లు అప్పు తీసుకున్న ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయులను కుదించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అందులో భాగంగానే సాక్షాత్తు విద్యాశాఖ కమిషనర్ రాష్ట్రంలోని ఉన్న 43 వేల పాఠశాలల నుండి 11 వేల పాఠశాలను కుదిస్తామని ప్రకటించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,70,000 ఉపాధ్యాయ పోస్టులను 1,10,000 పోస్టులకు కుదించేందుకు ఆలోచన చేస్తున్నారన్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్య పరుస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందకుండా చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.   రాష్ట్రంలో 17వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయని, 2020 నాటికి ప్రభుత్వ పాఠశాలలో 46 లక్షల మంది విద్యార్థులు కొనసాగుతుండగా 2025 నాటికి 31.50 లక్షల మందికి మంది మాత్రమే ఉన్నారని, ప్రస్తుతానికి ఆ సంఖ్య 29.30 లక్షల మందికి పడిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగకుండా కుట్రలు చేస్తూ, మరోపక్క ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గిపోవటానికి ఉపాధ్యాయులే కారకులని చిత్రీకరించేందుకు పాలకుల ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల విధానాల ఫలితంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోకపోతే, పేదలకు ప్రభుత్వ విద్య దూరమయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు "ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం-ఊరి బడిని కాపాడుకుందాం" అనే నినాదంతో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మాసం నుండే ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నాలుగు దశలుగా నిర్వహించాలని, నిర్ణయించామని ఆ మేరకు మొదటి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించామని, రెండవ దశలో మండల స్థాయి సమావేశాలు, మూడవ దశలో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నామని, నాలుగవ దశలో ప్రజా సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని యుటిఎఫ్ భుజానికెత్తుకొని ముందుకు వెళ్తున్నా పాలకుల నుండి ఎలాంటి ప్రోత్సాహం లేదన్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు యుటిఎఫ్ నాయకులు కార్యకర్తలు పాఠశాలల్లో ఉదయం ఒక గంటపాటు, సాయంత్రం ఒక గంటపాటు అదనంగా పనిచేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జి.గోపీనాథ్.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి. జిల్లా అకడమిక్ సెల్ కన్వీనర్ వీరదాసరి క్రిస్టఫర్. ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ టి.శివప్రసాద్. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని. బద్వేలు మండల అధ్యక్ష. ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం. సి.కంచి రెడ్డి, సహాధ్యక్షుడు వై.రామయ్య.ట్రెజరర్ ఎ.లాజరస్.గోపవరం మండల ప్రధాన కార్యదర్శి ఎం.రామచంద్రయ్య. ట్రెజరర్ బి.ఓబన్న. సహాధ్యక్షుడు వై.వెంకట రమణ.జిల్లా కౌన్సిల్ సభ్యులుసి.హెచ్.సాగర్.నరసింహులు.కొండయ్య.మహమ్మద్ గౌస్.ఆర్.రమణ.బాల ఓబన్న. ప్రసాద్.ఆర్. రాజా. ఎం.గుర్రయ్య. కె.మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments