google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 అట్లూరు మండలంలో రోడ్డు ప్రమాదం...

అట్లూరు మండలంలో రోడ్డు ప్రమాదం...

గాయపడిన బాధితులను ఆసుపత్రికి తగిలింపు...

మానవత్వాన్ని చాటుకున్న కడప డిసిసి చైర్మన్ మంచురి సూర్యనారాయణ రెడ్డి...

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం సమీపంలోని లింగాలకుంట చెరువు మధ్య మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఆటో టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో అదుపుతప్పిన ఆటో రోడ్డుకట్ట పక్కనున్న బోరులో పడిపోయింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్య నారాయణ రెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. గాయపడిన బాధితులను అక్కడే వదిలి పెట్టకుండా పరిస్థితిని పరిశీలించి, స్వయంగా ఆయన కారులోనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం అక్కడే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.  అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులకు తెలిపారు. ఆయన చూపిన మానవత్వం. వేగవంతమైన స్పందనను స్థానికులు అభినందించారు. ప్రజల కష్టసమయంలో ముందుండే నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పారని వారు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments